26 May, 2026 | 2:39 AM

కాంగ్రెస్‌పై విశ్వాసం పోయింది

26-05-2026 01:39 AM
  1. రాష్ర్టంలో వ్యవసాయ రంగ సంక్షోభం.. రైతులు అరిగోస పడుతున్నరు 
  2.    80 శాతం ధాన్యం కొన్నామన్న సీఎం రేవంత్ లెక్కలు అవాస్తవాలు
  3. బీజేపీ పర్యటనతోనే అధికారుల్లో చలనం వచ్చింది..
  4. ప్రభుత్వం బేషరతుగా రైతులు పండించిన పంట కొనుగోలు చేయాలి
  5. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
  6. వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో రైతు గోస-బీజేపీ భరోసా బస్సు యాత్ర
  7. కుల్కచర్ల, పరిగి, గజ్వేల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

వికారాబాద్/గజ్వేల్, మే 25: ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాటు 80 శాతం కొన్నామంటూ అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ చేపట్టిన రైతు గోస -భరోసా బస్సు యాత్రలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రైతులు ఆరబోసిన వడ్లను, గజ్వేల్ మార్కెట్ యార్డ్‌ను, వికారాబాద్ జిల్లా కుల్కచర్ల, పరిగిలో కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. తా ము బస్సు యాత్ర చేపట్టిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. బీజేపీ పర్య టిస్తేనే సమస్యలు  పరిష్కారమవుతాయంటే ప్రజల కోసం ప్రతిరోజు గ్రామాలను సందర్శించి, సమస్యలపై పోరాటం చేస్తామన్నా రు. వర్షాలు పడితే ధాన్యం నేలపాలు అయ్యే పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కోటిన్నర టన్నుల ధాన్యం రైతులు పండిస్తే 80% ఇప్పటికే కొనుగోలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెపుతున్నారని ఆరోపించారు. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద 50 శాతానికి పైగా ధాన్యం ఉన్నదని వెల్లడించారు. రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని, కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనే దిక్కు లేక రైతులు గుండె పగిలి చనిపోతున్నారని ఆరోపించారు. రాష్ర్టంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ము కోవడానికి రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి పడిగాపులు కాయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని విమర్శిం చారు.

రాష్ర్టంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడో ఒకచోట గుండె పోటుతో మరణిస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. రైతులకు టార్ఫాలిన్ కవర్లు, గన్నీ సంచులు ఇవ్వ ని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదన్నారు. బిజెపి రైతు భరోసా యాత్ర చేస్తుందని తెలిసి రాత్రికి రాత్రి హడావుడి చేసి గోనె సంచులు తెప్పించి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రైతుల పట్ల మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తే రైతులు ఎన్నటికీ క్షమించరని ఆరోపించారు.

రైతులకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కార్పొరేట్ వ్యవస్థకు వ త్తాసు పలుకుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్ర భుత్వ నిర్లక్ష్యం, కనీస ముందస్తు ప్రణాళిక లేకపోవడం, సకాలంలో ధాన్యం సేకరించడంలో ఘోర వైఫల్యం కారణంగా.. నేడు తె లంగాణ వ్యాప్తంగా వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిం దని విమర్శించారు. ధాన్యం కొనుగోలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

మరో వారం పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రా రంభమవుతున్న ఇప్పటివరకు రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో రైతుల సమస్యలపై స్పం దించడం లేదని విమర్శించారు. రైతులకు ఇ బ్బందులు కలిగించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ప్రతి గింజ కొను గోలు చేసే వరకు బీజేపీ రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. 

కేసీఆర్‌కు రైతుల గోస తెలియదా?

రైతునని చెప్పుకునే కేసీఆర్‌కు రైతుల గోస తెలియడం లేదా అని ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పర్యటన గురించి తెలిసి  సిద్దిపేట కలెక్టర్ ఆఘమే ఘాల మీద వచ్చి బయటనుంచి కార్మికులను తెచ్చి గజ్వేల్‌లో వడ్లను తరలించారని చెప్పారు.

వ్యవసాయం చేసే ముఖ్యమంత్రికి రైతు కష్టం తెలుసు కానీ మన సీఎం రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి కాబట్టి ఆయనకు ఫ్యూచర్ సిటీ కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. పంట నాటు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని ఎకరాలు పంట వేసిందో తెలుసుకోవాలని, బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నార న్నారు. తక్షణమే రవాణ వ్యవస్థను పెట్టి వడ్ల ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో మం డలి పక్షనేత ఏవిఎన్‌రెడ్డి, ఎంపీలు డీకే అరు ణ, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, రాకేష్‌రెడ్డి, హరీష్‌బాబు, సూర్యనారాయణ, రామారావు, పటేల్ ఎమ్మెల్సీ లు కొమరయ్య అంజిరెడ్డి, కిసాన్మోడ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య, బిజెపి వికారాబాద్ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు, రాష్ట్ర నా యకులు శరత్ కుమార్ రెడ్డి, పరిగి అసెంబ్లీ ఇన్చార్జి మారుతి కిరణ్, సిద్దిపేట జిల్లా బీజే పీ అధ్యక్షుడు బడి శంకర్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.