26 May, 2026 | 2:39 AM

హైదరాబాద్‌లో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీరు

26-05-2026 01:49 AM
  1. అధికారంలోకి రాగానే సరఫరా చేస్తాం 
  2.   24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆరే.. 
  3. కాంగ్రెస్ పార్టీ నగరానికి చేసిందేమీ లేదు 
  4. ప్రజలకు అవగాహన ఉన్నందునే ఆ పార్టీకి ఒక్క సీటూ ఇవ్వలేదు 
  5. గతంలో అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాం 
  6. ఈసారి పార్టీ శ్రేణులకు తగిన అవకాశం కల్పిస్తాం  
  7. కూకట్‌పల్లి కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో తాగునీటిని ప్రతి ఇంటికి 24 గంటలు సరఫరా చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోత, నీటి కొరత తీవ్రంగా ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టుదలతో 24 గంటల కరెంట్‌ను హైదరాబాద్‌కు, రాష్ట్రానికి అందించామని గుర్తుచేశారు.

తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ 24 గంటలు సురక్షిత తాగునీరు అందిస్తామని తెలిపారు. దగ్గరుండి మరీ హైదరాబాద్‌కు 24 గంటలు తాగునీటిని అందించే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో కనీసం కరెంట్, నీటి సరఫరా చేయలేని దుస్థితి ఉండేదని, నీరు, కరెంటు కోసం ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగే పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పట్టుదలతో 24 గంటల కరెంటు అందించారని చెప్పారు.

ప్రతి ఇంటి కీ పైప్‌లైన్‌తో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించామని తెలిపారు. రానున్న బీ ఆర్‌ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌కు కచ్చితంగా 24 గంటలు తాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరేనని, తిరిగి హైదరాబాద్‌కు 24 గంటల కరెంట్ ఇచ్చేది కూడా కేసీఆరేనని తెలిపారు. సోమవారం కూకట్‌పల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పెష ల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పైన కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్లపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏ ఒక్కరి ఓటు కూడా పో కుండా ప్రజలకు అండగా ఉండాలని కోరారు. దీనికోసం ప్రతి బూత్ నుంచి తగిన ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు. 

అడ్డగోలు హామీలతో అన్ని వర్గాలకు మోసం

అసెంబ్లీ ఎన్నికలప్పుడు అడ్డగోలుగా హా మీలు ఇచ్చి ప్రతి వర్గాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. పెన్షన్ల నుంచి మొదలుకొని మహిళలకు రూ.2,500 వరకు ప్రతి ఒక్క వర్గానికి.. హా మీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ అని ఆరోపించారు. ఈ రెండున్నరేండ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వా త కూడా ఈ నగరానికి ఒక్కటంటే ఒక్క రూ పాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో నిర్మించిన అనేక ఫ్లైఓవర్ల నుంచి మొదలుకొని టిమ్స్ ఆసుపత్రుల దాకా ప్రతి ఒక్క టి తామే నిర్మించామని, వాటి రిబ్బన్ కట్ చేస్తూ రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, ఒకవేళ హైదరాబాద్‌లో ఒక్క డబు ల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు.

కాంగ్రెస్ పాలన గురించి అవగాహన ఉన్న కారణంతోనే హైదరాబాద్ ప్రజ లు ఆ పార్టీకి ఒక్క సీటూ ఇవ్వలేదని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తి గా కాంగ్రెస్ వల్లే దెబ్బతిన్నదని, దీంతోని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుం డా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ, సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తామని తెలిపారు.

తమ పదేండ్ల పాలనలో అభివృద్ధే లక్ష్యంగా తదేక దీక్షతో పనిచేశామని, ఈసారి అధికారంలోకి వచ్చి న తర్వాత కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని గుర్తుంచుకొని తగిన అవకాశాలు కల్పిస్తామని భరో సా ఇచ్చారు. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ రూపంలోనే నిర్వహించబోతున్నదని, సభ్యత్వ నమోదుకు సంబం ధించిన  కార్యక్రమం, కమిటీల ఏర్పాటు దాదాపు 50 నుంచి 60 రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు కు పార్టీ తరఫున కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.