17 June, 2026 | 4:18 AM

ఏరాజ్పల్లిలో డ్రైనేజీ పనులు ప్రారంభం

17-06-2026 03:06 AM

బోధన్, జూన్ 16 (విజయక్రాంతి): బోధన్ మండలం ఏరాజ్పల్లిలో మంగళవారం డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ దేవిదాస్ గౌడ్ ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి వార్డు, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రజినీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ పవన్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.