యువజన కాంగ్రెస్ భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే పాఠశాల
జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి
భిక్కనూరులో యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం
భిక్కనూర్,(విజయక్రాంతి): యువజన కాంగ్రెస్ అనేది భవిష్యత్ నాయ కత్వాన్ని తీర్చిదిద్దే పాఠశాల అని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో మండల యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ లతో పాటు, యువజన కాంగ్రెస్ నాయకులు ఇలియాస్ పాల్గొని మాట్లాడారు.
భిక్కనూర్ పట్టణంలోని ఎస్‌వీ గార్డెన్‌లో ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు నియామక పత్రాలను షబ్బీర్ అలీ చేతుల మీదుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ లు అందజేశారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ అనేది కేవలం రాజకీయ విభాగం మాత్రమే కాకుండా భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే పాఠశాల అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యువజన కాంగ్రెస్ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్నారని అన్నారు, ప్రజా సమస్యలపై పోరాడే వారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. యువత ప్రతిపక్షాల అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.






