ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
09-04-2026 12:24 AM
ఇల్లందు టౌన్ ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు మృతి చెందిన విషాద ఘటన ఇల్లందు మండలం బొల్లి నగర్ లో చోటు చేసుకుంది. తిలక్ నగర్ పంచాయతీ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన యాదగిరి సునీత దంపతుల కుమారుడు సిలివేరి అభిచంద్ర ఇంటర్ చదువుతున్నాడు. ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఒకసారి కరెంట్ షాక్ తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.




