5 August, 2026 | 2:58 AM

ఈఎస్‌ఐలో ఘనంగా బోనాల వేడుక

05-08-2026 02:00 AM

రామచంద్రపురం, జూలై 4 (విజయ్ర కాంతి) : రామచంద్రపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రాంగణంలోని మైసమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో వేద పండితుడు అరవింద్ స్వామి మంత్రోచ్ఛారణ, అమ్మవారికి ఇష్టమైన ప్రత్యేక నృత్యంతో భక్తులం దరినీ అలరించి, మంత్రముగ్ధుల్ని చేశారు.

ఆషాడ మాసం ప్రారంభమైందంటే చాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈఎస్‌ఐ వైద్యా ధికారి రమేష్ బాబు పర్యవేక్షణలో ఈఎస్‌ఐ ఆసుపత్రి సిబ్బంది పాల్గొనగా మైసమ్మ బోనాలను ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులతో పాటు వారి బంధువులు అమ్మవారి విశేష పూజలో పాల్గొని తరించారు.