5 August, 2026 | 2:57 AM

ఇద్దరు లారీ డ్రైవర్లకు 5 రోజుల జైలు

05-08-2026 01:59 AM

రూ.10 వేల చొప్పున జరిమానా 

సిద్దిపేట క్రైం, ఆగస్టు 4 (విజయ క్రాంతి) : మద్యం తాగి లారీ నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లను పట్టుకొని కోర్టులో హాజరు పరిచినట్టు ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపారు. సోమవారం న్యాయమూర్తి కాంతారావు విచారణ జరిపి, ఇద్దరికి చెరో రూ.10 వేల జరిమానా, 5 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు.