5 August, 2026 | 3:54 AM

శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో 14.819 టీఎంసీలు

05-08-2026 12:00 AM

సగానికి పైగా నీటి నిల్వ, జలాశయానికి జలకళ

బోయినపల్లి: ఆగస్టు 4(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండ లం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో మంగళవారం సాయంత్రం వరకు 14.819 టీఎంసీల నీటి నిలువ కు చేరింది. ఇంకా ఇన్ఫ్లో కొనసాగుతుంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం పది రోజుల క్రితం వరకు నీటి నిలువలేక వెలవెలబోయింది. వరుణ దేవుడు కరుణించడంతో వారం రోజుల క్రితం నుంచి వర్షాలు పడుతుండడంతో చెరుకుంటలు నిండి సాగునీటికి కొరత లేకుండా పోయింది. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండి దిగువన ఉన్న ప్రాజెక్టులకు వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

ఈ తరుణంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి ఐదు రోజులుగా నీటిని విడుదల చేయడంతో వరద కాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయముకు ఎల్లంపల్లి జలాలు చేరుకుంటున్నాయి. మంగళవారం 15 104 క్యూసెక్కుల ఎల్లంపల్లి జలాలు రాగా జలాశయం 27.55 టీఎంసీల సామర్థ్యానికి గాను 14.818 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా కూడా రాముడు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువ ద్వారా ఎల్లంపల్లి జలాలు మానువాడ జలాశయం కు చేరుకుంటున్నాయి. దీంతో ప్రాజెక్టు జలకల సంతరించుకున్నది. ఉమ్మడి జిల్లా రైతుల్లో ఆనందం నెలకొన్నది.