18 June, 2026 | 1:46 AM

గడువులోపు కేవైసీ పూర్తి చేసుకోవాలి

18-06-2026 12:05 AM

నిర్మల్ జూన్ 17 ( విజయక్రాంతి): నిర్ణిత గడువులోగా వంద శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో ఎల్పీ జీ వినియోగదారుల ఈ-కేవైసీ ప్రక్రియ నిర్వహణపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, సంబంధిత అధికారులు, ఎల్పీజీ సరఫరాదారులతో  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఈ నెల 30వ తేదీలోగా ఈ-కేవైసీ ప్ర క్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పూర్తిచేసిన ఈ-కేవైసీ ప్రక్రియ వివ రాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులను గుర్తించి వారి కోసం ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని సూచించారు. స మాచారాన్ని ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ ల ద్వారా వినియోగదారులకు తెలియజేయాలన్నారు.

ప్రతి వినియోగదారుడు సులభంగా ఈ-కేవైసీ చేయించుకునేలా వీలు కల్పించాలని పేర్కొన్నారు.నిర్ణీత గడువు తేదీ లోపు ప్రక్రియను పూర్తి చేయని ఎల్పీజీ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, ఇతర అధికారులు, సిబ్బంది, ఎల్పీజీ డీలర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.