18 June, 2026 | 1:25 AM

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి

18-06-2026 12:07 AM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్ ,జూన్ 17(విజయ క్రాంతి): జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఈనెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహించవలసి ఉన్నందున జిల్లాలో ప్రజలకు అవ గాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.

బుధవారం కలెక్టరేట్ లో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం, తపాలా శాఖలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి పథకం కింద బీమా పాలసీ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించాలని, అవస రమైన ధ్రువపత్రాలను ఫారం తో పాటు బూతు స్థాయి అధికారులకు అందజేయాలని తెలిపారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొ సైటీలో ప్రతి ఒక్కరు సభ్యత్వం చేసుకోవాలని, భారతీయ తపాలా శాఖలో ప్రధా నమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం క్రింద అర్హులైన ప్రతి ఒక్కరూ 565 రూపాయలు చెల్లించి బీమా పొందేలా దినపత్రికలు,, వివిధ ప్రచార, ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్, జిల్లా మీడియా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.