30 August, 2026 | 1:26 AM

యోగాతో మానసిక శారీరక శక్తి పెరుగుతుంది

30-08-2026 12:21 AM

బోథ్,(విజయక్రాంతి): ప్రతిరోజు యోగ చేయడం వల్ల ఒత్తిడిని జయించి మానసిక శారీరక శక్తిని పెంచుకోవచ్చని యోగ శిక్షకురాలు మునిగల యో గీత పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరోగ్య పాఠశాల మూడు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగా తరగతులను నిర్వహించారు.

ఈ సందర్భంగా కాగ్నిటివ్ ముద్రను యోగా ధ్యానంతో కలిపి సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుల్లో మరింత చురుగ్గా తయారవుతారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులు భోజన్న నితిన్ సుధారాణి హేమలత కృష్ణ జ్యోతి తిరుపతిరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు