నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకై స్థల పరిశీలన చేసిన విద్యుత్ ఏఈ
30-08-2026 01:02 AM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణంలోని 14వ వార్డులో లోవోల్టేజీ సమస్యతో బాధపడుతున్నామని గత బుధవారం విద్యుత్ ఏ ఈ నీ కలసిన వార్డు సభ్యులు ఆకులు సుఖేందర్ విన్నపానికి విద్యుత్ సబ్ ఇంజనీర్ స్పందించి 14 వ వార్డులో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకై పరిశీలన చేశారు. త్వరలోనే నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి లో వోల్టేజి సమస్య తలెత్తకుండా చేస్తామని ఏ ఈ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్ ఎలక్ట్రిసిటీ ఏఈ వెంకటప్ప రెడ్డి కాంట్రాక్టర్ విశ్వేశ్వర్, ఆది సురేందర్, లైన్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.






