30 August, 2026 | 4:46 AM

చెరువుల రక్షణకు చట్టం తీసుకురండి

30-08-2026 01:18 AM
  1. రైతు సంక్షేమ కమిషన్
  2. సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందజేత

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్ర తినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి నివేదిక అందించింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పా టు చేయాలని కమిషన్ తన నివేదికలో సూచించింది.

తెలంగాణ వ్యవసాయ - రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్, రాం రెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, ఎం. భవానీరెడ్డి ముఖ్యమంత్రిని శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి నివేదిక అందించారు.కమిషన్ సిఫారసులపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు.

పంటల మార్పిడి, ఉద్యానవన పంట ల సాగు పెంపు, ఎఫ్‌పీవోల ఏర్పాటు వంటి అంశాలపై కమిషన్ దృష్టి పెట్టాలని ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. రా ష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చేందుకు నివేదికలో కమిషన్ ప్రభుత్వా నికి పలు కీలక సూచనలు చేసింది. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను కలిపే కమాం డ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది.

చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టం రూపొందించాలని, చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) సరిహద్దులను తక్షణం గుర్తించి ఆక్రమణలను తొలగించి ప రిరక్షించాలని పేర్కొంది. తెలంగాణలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధర ణ అత్యంత అవసరమని తెలిపింది.

గడిచిన రెండేళ్ల కాలంలో రైతు కమిషన్ చేపట్టిన కా ర్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సూచనలు సీఎంకు వివరించారు. రైతు కమిషన్ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.