30 August, 2026 | 2:24 AM

దద్దరిల్లిన కీవ్

30-08-2026 01:22 AM

ఉక్రెయిన్ రాజధానిపై రష్యా డ్రోన్ దాడులు

37 మంది మృతి.. 42 మంది క్షతగాత్రులు

కీవ్, ఆగస్టు ౨౯: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శుక్రవారం అర్ధరాత్రి రష్యా విరుచుకుపడింది. ఏకధాటిగా జరిపిన డ్రోన్ దాడుల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మంది క్షతగాత్రులయ్యారు. దాడుల్లో ౫౦కి పైగా నివాసాలు దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం 380 మందికి పైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు.

మౌలిక సదుపాయాలు, చమురు నిల్వ సంస్థలు, నౌకాశ్రయాలు, లాజిస్టిక్స్ గోదాములను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరింపజేశారు. మరోవైపు, కీవ్ సమీపంలోని మైలా గ్రామంలో ఉన్న ప్రైవేటు సంస్థ పేలుడు పదార్థాల గోదామును రష్యా టార్గెట్ చేసి డ్రోన్లు ప్రయోగించిందని, అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని యంత్రాంగం గుర్తించింది. నివాస ప్రాంతాల మధ్య మందుగుండు సామగ్రి నిల్వ చేయడంపై దర్యాప్తు చేస్తున్నది.