ప్రాణహితకు పునరుజ్జీవం
- తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల బరాజ్
- 1న మహారాష్ట్రతో చర్చలు
- సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో భేటీ
- కోల్పోయిన ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం
- రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీ లేదు
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రాణహిత ప్రాజెక్టును పున రుజ్జీవింపజేసి, తెలంగాణ రైతాంగానికి సా గునీటి ప్రయోజనాలను తిరిగి అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహి త నదిపై 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి సాధించడమే ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఇది కార్యరూపం దాల్చితే దాదాపు 80 టీఎంసీల ప్రా ణహిత జలాలను గ్రావిటీ ద్వారా సుందిళ్ల బరాజ్‌కు తరలించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. దీని వల్ల ఎత్తిపోతల భారం, విద్యుత్ వ్యయాన్ని భారీగా తగ్గించవచ్చన్నారు.
సెప్టెంబర్ 1న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ అంతర్రాష్ట జల చర్చల నేపథ్యంలో శనివారం సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు, ముంపు ప్రభావం, సాం కేతిక సాధ్యాసాధ్యాలు, అంతర్రాష్ట్ర అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయని వెల్లడించారు. తెలంగాణ మధ్య అధికారిక చర్చల ప్రక్రియ ప్రారంభం కావడమే ప్రాణహిత పునరుజ్జీవనంలో కీలకమై న అడుగని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం, నీటిపారుదల శాఖ కేంద్రంతో నిరంతరం జరిపిన సంప్రదింపులు, ఉత్తర ప్రత్యు త్తరాల ఫలితంగానే ఈ చర్చలకు మార్గం సు గమమైందన్నారు. రాష్ట్రంలోని గత ప్రభు త్వం 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి అంగీకరించిందని, దానికి బదులుగా 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర సమ్మతి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) సాంకేతిక అధ్యయనాల ప్రకారం 148 మీటర్ల స్థాయిలో అయితే మ హారాష్ట్ర భూభాగంలో సుమారు 1,150 ఎకరాలు.. 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 2,500 ఎకరాలకు పైగా ముంపునకు గుర య్యే అవకాశం ఉందని తెలిపారు.
రెండు విధాలా ముంపు ఉన్నప్పటికీ.. 152 మీటర్ల స్థాయిలో బరాజ్ నిర్మిస్తు సాంకేతికంగా తెలంగాణకు అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. ‘152 మీటర్ల స్థాయిలో బరాజ్ నిర్మా ణానికి మహారాష్ట్ర సమ్మతి సాధించేందుకు గత ప్రభుత్వం మరింత సమర్థంగా చర్చించాల్సి ఉండేదని మంత్రి అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను తగినంతగా పరిరక్షించకుండా 148 మీటర్లకు అంగీ కరించడం వల్ల తెలంగాణ ఒక కీలక అవకాశాన్ని కోల్పోయిందిన్నారు. ప్రాణహిత ప్రతి పాదనకు 1975, 1978 అంతర్రాష్ట్ర ఒప్పందాలు బలమైన న్యాయ, సంస్థాగత పునాది గా ఉన్నాయని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదని, దశాబ్దాల క్రితం ఏర్పడిన అంతర్రాష్ట్ర అవగాహనకు అనుగుణంగా తెలంగాణ ప్రయోజనాలను సాధించే ప్రయత్నమని పేర్కొన్నారు.
ప్రతి నీటి చుక్కనూ కాపాడుతాం
వాస్తవానికి ప్రాణహితేొచేవెళ్ల సుజల స్రవంతి పథకం సుమారు 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూపుదిద్దుకుందని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. అనంతరం జరిగిన ప్రాజెక్టు పునరాక ల్పన, పునర్వ్యవస్థీకరణలో అసలు ప్రతిపాదిత ఆయకట్టులోని గణనీయమైన ప్రాంతా లు సాగునీటి ప్రయోజనాలకు దూరమయ్యాయని తెలిపారు.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లోని దాదాపు రెండు లక్షల ఎకరాలకు సమర్థమైన సాగునీటి వనరు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం దాటినా అసలు ప్రాణహితచేవెళ్ల పథకం ద్వారా నీరందుతుందని ఆశించిన రైతుల నిరీక్షణ కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు.
ప్రాణహిత పునరుజ్జీవనం అంటే కేవలం బరాజ్ నిర్మించడమే కాదు, సాగునీటి హామీ కోల్పోయిన ప్రాంతాలకు తిరిగి జలభరోసా కల్పించడమని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలు కూడా ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పునరాకల్పన చేసిన సమయంలో కీలక ప్యాకేజీలను తొలగించడంతో ఆయా ప్రాంతాలు తమకు ఉద్దేశించిన సాగునీటి వనరును కోల్పోయాయని పేర్కొన్నారు. అసలు ఆయకట్టులో ఉన్నప్పటికీ పునరాకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ప్రాంతాలకు తగిన జలభరోసా లభించలేదన్నారు.
అందువల్ల ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి ప్రాంతాలు సాగునీటి ప్రయోజనాలు కోల్పోయాయని, వాటిని తిరిగి అందించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న జరిగే సమావేశంలో 152 మీటర్ల ప్రతిపాదిత బరాజ్ స్థాయి, మహారాష్ట్రలో ముంపు ప్రభావం, సాంకేతిక సాధ్యాసాధ్యాలు,
అంతర్రాష్ట్ర అంశాలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తామని మంత్రి తెలిపారు. మహారాష్ట్రతో సానుకూలంగా, నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుతూనే తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నదీజల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.
తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత అని, మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరుపుతామని తెలిపారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరిగే భేటీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు సీడబ్ల్యూసీలోని కీలక డైరెక్టరేట్ల అధిపతులు పాల్గొంటారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.






