30 August, 2026 | 2:23 AM

వేప చెట్టు చిచ్చు

30-08-2026 01:23 AM
  1. 25 ఏళ్ల నుంచి రెండు కుటుంబాల మధ్య పగ
  2. ఇరువర్గాల మధ్య తరచూ ఘర్షణ గొడ్డలితో దాడి.. ఇద్దరు మృతి
  3. అడ్డుకోబోయిన ఎస్సైకి స్వల్ప గాయాలు
  4. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామం
  5. సూర్యాపేట జిల్లా ఎర్రగట్టు తండాలో ఘటన

మేళ్లచెరువు, ఆగస్టు 29 (విజయక్రాంతి): రెండు కుటుంబాల మధ్య వేప చెట్టు చిచ్చు (Neem Tree Fire)పెట్టింది. ఈ ఘర్షణ 25 ఏళ్లుగా చిలికిచిలికి తీవ్రరూపం దాల్చింది.  ఇరువర్గాల మధ్య తరచూ కుంపటి దారుణమైన రక్తపాతానికి దారితీసింది. మాటా మాటా పెరిగి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇరువర్గాలు విచక్షణ కోల్పోయి ఏకంగా గొడ్డళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు.

ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. అడ్డుకోబోయిన ఎస్సైకీ గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో రెండు కుటుంబాలకు చెందిన ఇంటి గోడల మధ్య ఉన్న వేపచెట్టు విషయంలో అమరబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, భూక్యా సైదా కుటుంబాల మధ్య గొడవలు ఉన్నా యి.

25 ఏళ్లుగా ఆ చెట్టు విషయంలో ఇరు కుటుంబాలు ఘర్షణ పడుతున్నా యి. ఈ వేపచెట్టును సైదా కుటుంబ సభ్యులు తమ ఇంటి వైపు ఉన్న చెట్టు మొదలు భాగం వద్ద కూలిపోయేలా చేయడంతో శుక్రవారం ఆది అమరబోయిన వెంకటేశ్వర్లు ఇంటి మీదికి పడిపోయిందన్నారు.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రెండు కుటుంబాల మ ధ్య చిన్న ఘర్షణ తలెత్తి మాట మాట పెరిగి అది తీవ్ర రూపం దాల్చింది. దీంతో అమరబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ ఉదయం కొంతమందిని పిలిపించాడు. ఈ విషయం పై భూక్యా సైదా కుమారుడు రాము వెంకటేశ్వ ర్లు వద్దకు వెళ్లి గొడవకు దిగాడు.

వేప చెట్టు విషయంలో గొడవలు జరుగుతున్నా యి కదా? వివాదంలో ఉన్న చెట్టును ఎలా నరికేస్తారు? అంటూ వెంకటేశ్వర్లును నిలదీశాడు. దీంతో ఇరువర్గాల మధ్య క్రమంగా మాటామాటా పెరగడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. రెండు వర్గాల వారు కర్రలు, గొడ్డళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈ క్రమంలో భూక్య సైదా పెద్ద కుమారుడు భూక్య పెదబాబు, మరొక కుమారుడు రాము ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న అమరబోయిన వెంకటేశ్వర్లు(70)పై గొడ్డలితో దాడి చేయగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

వెంటనే పెదబాబు ఈ వివాదంలో ఇరువురు దాడి చేసుకున్నారని ఇరువైపులా గాయాలయ్యాయని చెప్పే ందుకు తన తండ్రి భూక్య సైదా(60)పై కూ డా గొడ్డలితో దాడి చేశాడన్నారు. అయితే అతనిని చికిత్స నిమిత్తమై హుజూర్ నగర్‌కు తరలించగా అక్కడ చనిపో యాడన్నారు. 

రాళ్ల దాడిలో ఎస్‌ఐకి గాయాలు

విషయం తెలుసుకున్న మేళ్ల చెరువు ఎస్‌ఐ నవీన్ కుమార్ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే భూక్యా రాము ఇంటిపై కొందరు స్థానికులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడి నే పథ్యంలో ఎస్‌ఐ నవీన్ కుమార్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి.

దీంతో వెంటనే ఎస్‌ఐని సిబ్బంది హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు అమరబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ మరోవైపు తన తండ్రి భూక్యా సైదాను హత్య చేసిన రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గ్రామంలో పోలీస్ పికెట్

గ్రామంలో ఈ వివాదం జరిగిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

సంఘటన తెలిసిన వెంటనే కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ఎస్సైలు నవీన్ కుమార్, పరమేష్ నరేష్ లతోపాటు పోలీస్ బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ హత్య కేసులో నిందితుడైన భూక్య పెదబాబు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉం డి,

ఇటీవల సస్పెండ్ కు గురైనట్లు స్థానికు లు తెలిపారు. గ్రామంలో అందర్నీ బెదిరిస్తూ కేసులు పెడుతుంటాడని, సైకోలా ప్ర వర్తిస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెటింగ్ నడుస్తుంది. కేసు విషయంలో నిందితుల్ని అదు పులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.