30 August, 2026 | 1:32 AM

భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి

30-08-2026 12:25 AM

పెండింగ్ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

పట్టాదారు పాస్‌బుక్‌ల సమస్యలకు పరిష్కారం చూపాలి

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

ఉమ్మడి నల్లగొండ జిల్లా శాఖల సమీక్షలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు,(విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, హౌసింగ్ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.

సమావేశంలో ఆలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, సర్వేలు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల సవరణ, పట్టాదారు పాస్‌బుక్‌ల సమస్యలను బీర్ల అయిలయ్య మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు.