calender_icon.png 20 February, 2026 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనులను పరిశీలించిన యరుగండ్లపల్లి సర్పంచ్

20-02-2026 10:15:55 AM

మర్రిగూడ,(విజయక్రాంతి): మండలంలోని యరుగండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆ గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్  క్షేత్రస్థాయిలో పరిశీలించారు  నేరుగా కూలీలను కలిసి పనుల ప్రాముఖ్యతను వివరిస్తూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి కల్పించుట కోసం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని వివరించారు. పని ప్రదేశాలలో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కారం గురించి కూడా తెలుసుకున్నారు ఆయన వెంట పంచాయతీ సెక్రటరీ శ్రవణ్  కుమార్ ఫీల్డ్ అసిస్టెంట్ వల్లంల శ్రీశైలం  చామకూర ముత్యాలు గౌడ్ ఉన్నారు.