40 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలి
కేంద్ర ఓబీసీ కమిషన్ చైర్‌పర్సన్‌కి వీహెచ్ వినతి
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 40 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఓబీసీ ) చైర్‌పర్సన్ సాద్వి నిరంజన్‌జ్యోతికి మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమం తరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఓబీసీ కమిషన్ చైర్మన్‌తో వీహెచ్ భేటీ అయి 40 బీసీ కులాలకు చెం దిన జాబితాను అందజేశారు.
ఈ 40 బీసీ కులాలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు అందాలంటే కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయా లని వీహెచ్ కోరారు. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి.. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, పెండిం గ్‌లో ఉన్న సాంకేతిక అడ్డంకులను తొలగించడానికి వేగంగా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టమైన హామీ ఇచ్చారని వీహెచ్ తెలిపారు.
ఈ సమస్యను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి ఓబీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని తెలిపారని ఆయన వివరించారు. బాధిత వర్గాలకు త్వరితగతిన న్యాయం జరిగేలా, ఈ ప్రతిపాదన తక్షణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఓబీసీ కమిషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పర్యవేక్షిస్తుందని వీహెచ్ పేర్కొన్నారు. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్మన్‌కు వీహెచ్ కృతజ్ఞతలు తెలిపారు.






