ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్.. మెరుపు ధర్నా
విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా ప్రధాని నివాసం వద్ద రాహుల్.. ప్రియాంక, ఇతర కాంగ్రెస్ నాయకుల బైఠాయింపు
- చేతులను తాళ్లతో బంధించుకుని వినూత్నంగా నిరసన
- ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామాకు డిమాండ్
- ప్రశ్నాపత్రాల లీకేజీపై పార్లమెంట్‌లో చర్చ, కేంద్ర హోంమంత్రి వివరణకు పట్టు
- ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు పరిహారం, లాఠీచార్జిపై విచారణకు డిమాండ్
- బలవంతంగా అదుపులోకి రాహుల్, ప్రియాంక
- మందిర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌కు ప్రియాంక తరలింపు.. సోనియా పరామర్శ
- ఛత్రసాల్ స్టేడియానికి రాహుల్‌గాంధీ.. ముక్కుకు గాయం.. రక్తస్రావం
- కొద్దిసేపటి తర్వాత ఇద్దరిని విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ, జూలై ౨౧: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం దేశ రాజధాని కల్యాణమార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసం వద్ద మెరపు ధర్నా చేపట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలతో కలిసి ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
అగ్రనేతలంతా చేతులను తాళ్లతో బంధించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఉదయం మొదలైన నిరసన హైడ్రామా నడుమ సాయంత్రం వరకు సాగింది. సాయంత్ర ౬:౪౦ గంటల ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నా ప్రదేశం నుంచి వారిని బలవంతంగా ప్రత్యేక వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.
ఛత్రసాల్ స్టేడియానికి రాహుల్‌ను తరలించగా, మందిర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌కు ప్రియాంకను తీసుకెళ్లారు. తర్వాత ప్రధాని నివాసం చుట్టూ భారీగా భద్రతా దళాలను మోహరింపజేశారు. ధర్నా కొనసాగిస్తున్న ఆందోళనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మందిర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రియాంకా గాంధీని పరామర్శించేందుకు ఆమె తల్లి, ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వెళ్లారు.
పోలీసులు అందుకు ససేమిరా అన్నారు. సోనియా గాంధీ గట్టిగా నిలదీయగా, అనంతరం పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించారు.రాహుల్, ప్రియాంకను పోలీసులు బలవంతంగా తరలించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతుండగా, పోలీసులు ఇంతలోనే రాహుల్, ప్రియాంకను విడుదల చేయడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
రాహుల్ ముక్కు నుంచి రక్తం
రాహుల్ గాంధీని బలవంతంగా తరలించే సమయంలో ముక్కులో నుంచి రక్తం రావడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేసింది. పోలీసులు బలవంతంగా ఆయన్ను తరలించే సమయంలో ఆయన ససేమిరా అన్నారని, దీంతో పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. ఆ సమయంలోనే రాహుల్‌కు గాయమైందని, అందుకే ముక్కు రక్తస్రావమైందని ఆరోపిస్తున్నాయి.
ఐదు డిమాండ్లతో ధర్నా
కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఐదు డిమాండ్లతో ధర్నా చేపట్టింది. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. నీట్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, యావత్ దేశంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ ఇప్పటికైనా మౌనం వీడాలని హితవు పలికారు.
అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీపై పార్లమెంట్ లో చర్చ పెట్టాలని, సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాల్సిందేనని తేల్చిచెప్పారు. పేపర్ లీక్ కారణంగా మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడిన ప్రతి విద్యార్థి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీజేపీ ‘చలో పార్లమెంట్’ ర్యాలీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని పట్టుబట్టారు.
లాఠీచార్జ్‌లో క్షతగాత్రులైన ప్రియాంకగాంధీ మాట్లాడుతూ.. విద్యార్థుల ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నదని ఎద్దేవా చేశారు. అఖిలేష్ యా దవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల డిమాండ్లను వినడం ప్రధాని మోదీ కనీస బాధ్యత అని నొక్కి చెప్పారు. ప్రధాని కనీసం వారి డి మాండ్లను విని ఉంటే బాగుంటుందని హిత వు పలికారు. ధర్నాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం డీకే శివకుమా ర్, కేరళం సీఎం సతీశన్ పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఎదుట డిమాండ్లు
ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ధర్నా చేస్తున్న నేపథ్యంలో అక్కడికి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెళ్లారు. వారు నిరసన తెలిపే ప్రాంతం, ధర్నాకు కేటాయించిన ప్రాంతం కాదని, కాంగ్రెస్ నేతలు తక్షణం అక్కడి నుంచి వెళ్లిపోవాలని రాహుల్‌కు కేంద్ర మంత్రి సూచించారు. దీంతో రాహుల్ స్పందిస్తూ.. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, విద్యార్థుల ఉద్యమంపై పార్లమెంట్‌లో చర్చకు మీ ఇస్తే నిరసన విరమించేది లేదని తేల్చిచెప్పారు.
అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీంతో కేంద్ర మంత్రి పెదవి విరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సైతం ఉన్నారు.
విపక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి: ప్రధాని మోదీ
నీట్ లీకేజీ వార్తలు బయటకు వచ్చిన వెంటనే కేంద్రం తక్షణం స్పందించిందని, 13 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పార్లమెంట్‌లో నిర్వహించిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఏ ఒక్క నిందితుడూ తప్పించుకుకోకుండా ‘ధురంధర్” (ఉద్దండులైన) అడ్వొకేట్లను నియమిస్తామని స్పష్టం చేశారు.
విపక్షాలు అనవసరంగా విద్యార్థులను రెచ్చగొట్టి పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. పేపర్ లీకేజీ అంశం కేవలం ఒక రాష్ట్రానికి చెందిన లేదా కేంద్రానికి సంబంధించిన సమస్యో కాదని, అది యావత్ దేశానికి చెందిన విద్యార్థుల భవితకు సంబంధించిన సమస్య అని తెలిపారు. అలాంటి సమస్యను విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హితవు పలికారు.
విద్యార్థులను దారితప్పించడం చాలా తేలికని, సరైన మార్గంలో నడిపించడమే కష్టమని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం తామందరం పోరాడుతు న్నామని చెప్పారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిన అవస రం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో కాం గ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
యువత భవిష్యత్‌కే రాహుల్ పోరాటం: సీఎం రేవంత్‌రెడ్డి
యువత భవిష్యత్ కోసం రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని సీఎం రే వంత్‌రెడ్డి అన్నా రు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జీ బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసం వద్ద ధర్నా చేపట్టారని పేర్కొన్నారు. ఆందోళనకు మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి ఎ క్స్‌లో పోస్టు పెట్టారు, యంగ్ ఇండియా కు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్‌వి నాటకీయ రాజకీయాలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ప్రధాని నివా సం బయట కాం గ్రెస్ చేపట్టిన నిరసన ఆ పార్టీ నాటకీయ రాజకీయాలకు నిదర్శ నమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించడం, ప్రభుత్వా న్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యతన్నారు. చర్చ లో పాల్గొని దేశ నిర్మాణానికి నిర్మాణాత్మకంగా సహకరించాలి, కానీ ప్రధాని ఇంటి ముందు ధర్నా పేరుతో నాటకాలు ప్రదర్శించడం సరైందని కాదన్నారు.






