calender_icon.png 20 February, 2026 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ వాటర్ మెన్ మృతి

20-02-2026 11:27:22 AM

సంతాపం తెలిపిన సర్పంచ్, ఉప సర్పంచ్ .

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దముల్ గ్రామపంచాయతీ వాటర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న సాకలి నరసింహులు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసింహులు గత రాత్రి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను తాండూరులోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ డివై నర్సింలు ఉప సర్పంచ్ బివై ప్రసాద్, వార్డు సభ్యులు మృతుడి నివాసానికి వెళ్లి వారి కుటుంబానికి పరామర్శించి అంత్యక్రియల కోసం రూ 10,000 అందజేశారు. గ్రామంలో అందరితో చిన్న పెద్ద తేడా లేకుండా కలివిడిగా ఉండే చాకలి నరసింహులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.