జోడీ కుదిరిందా?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి పనిచేయడా నికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతా నికి ‘ఆర్‌సీ17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ బిగ్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటికే రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రసు ్తతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. అతిత్వరలోనే చిత్రీకరణను కూడా ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టు గురించి పలు రకాల వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉండబోతోందని టాక్. ఇలా ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించే హీరోయిన్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్‌గా మారింది. ఇందులో రామ్‌చరణ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రష్మిక ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ ఫ్రాంచైజీలో నటించింది.
అంతేకాదు ఆ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకుందీ నేషనల్ క్రష్. రష్మికకు పాన్-ఇండియాగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆమె నటన ఈ కథలోని హీరోయిన్ క్యారెక్టర్‌కు పక్కాగా సెట్ అవుతాయని భావిస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్‌చరణ్- కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్టుకు రష్మిక కూడా తోడైతే సినిమా మరో స్థాయిలో ఉంటుందనేది నెటిజన్ల అభిప్రాయం. ఏదేమైనా ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే!






