26 August, 2026 | 2:43 AM

వన మహోత్సవంలో భారీగా మొక్కలు నాటిన యాదాద్రి అటవీ సంరక్షణ అధికారి

26-08-2026 12:01 AM

మహబూబ్‌నగర్, ఆగస్టు 25: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ స్థాయిలో మొక్కల నాటకం, నీటిమట్టి సంరక్షణ పనులు చేపడుతున్నట్లు జోగులాంబ, యాదాద్రి సర్కిల్ అటవీ సంరక్షణ అధికారి శివాల రాంబాబు తెలిపారు.

మంగళవారం మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లి గ్రామంలో నిర్వహించిన మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహబూబ్నగర్ జిల్లాలో ఒక్కరోజే సుమారు 70 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు.

వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపు, నేల కోత నివారణ లక్ష్యంగా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్డ్యామ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అటవీ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, ఇతర ప్రభుత్వ శాఖల సమిష్టి భాగస్వామ్యంతో వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి. శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.