26 August, 2026 | 3:25 AM

మొక్కలు నాటి సంరక్షించాలి

26-08-2026 02:20 AM

మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి, ఆగస్టు 25 (విజయ క్రాంతి): ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శంకర్పల్లి పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసు వెనక ఉన్న వెంచర్ లో మెగా ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చైర్మన్, మున్సిపల్ కమిషనర్ యోగేష్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజలందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు ప్రశాంత్, అశోక్, ఫైముదా బేగం సమీ, గిరిజ చంద్రశేఖర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.