బైక్‌ను ఢీకొన్న కారు
ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
కారు డ్రైవర్‌పై కేసు నమోదు
ఘట్‌కేసర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): బైక్, స్కూటీ వాహనాలను కారు ఢీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రా ష్ట్రం, బాలాఘాట్ జిల్లాకు చెందిన నాగ్పురే రంజిత్, అతని బంధువులు గ్రామస్తులైన అరుణ్ (26), ఉమేష్ (20), ప్రదీప్ (24), సజన్ (25) బతుకుదెరువు కోసం ఘట్కేసర్ వచ్చి కొండాపూర్ లోని విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజీలో పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
సోమవారం రాత్రి అరుణ్, ఉమేష్, ప్రదీప్, సృజన్ నలుగురు కలిసి తమ బైక్ (AP10BA9335) పై ఘట్కేసర్ వెళ్లి తిరిగి వస్తుండగా, విజ్ఞాన్ కాలేజ్ సమీపంలో ఎదురుగా అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన కారు (TG08KF0652) వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత అదే వేగంతో మరో స్కూటీ (TG228573)ని కూడా ఢీకొట్టింది. బ్పై ఉన్న అరుణ్ కుడికాలు విరిగి, శరీర భాగాలకు తీవ్ర రక్తగాయాలు కాగా ఉమేష్, ప్రదీప్, సజన్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీపై ప్రయాణిస్తున్న కొట్టె అజయ్ (21) కు కూడా తీవ్ర రక్తగాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అరుణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా క్షతగాత్రులలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం పంజాగుట్టలోని మెడిటెక్ హాస్పిటల్ నాకు తరలించారు. నాగ్పురే రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ కు చెందిన కారు డ్రైవర్ రౌత్ వేణుగోపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అరుణ్ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించడం జరిగింది. ఇట్టి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.






