26 August, 2026 | 3:47 AM

బ్యాంకర్లు రుణ లక్ష్యాలను సాధించాలి

26-08-2026 12:01 AM

ఆసిఫాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): అర్హులైన వారికి నిబంధనల ప్రకారం రుణాలు అందించి, నిర్దేశించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్  ఎం. డేవిడ్తో కలిసి వివిధ బ్యాంకుల మేనేజ ర్లు, అధికారులతో జిల్లా స్థాయి కమి టీ స మీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం స హా యక సంఘాలకు బ్యాంకు లింకేజీ ప్రక్రియ ను పూర్తి చేసి, రికవరీ అనంతరం నూత న రుణాలు అందించాలని సూచించారు. జిల్లా లో 8,163 స్వయం సహాయక సం ఘాలు ఉన్నందున మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవా లన్నారు. ఖరీఫ్ సీజన్లో అర్హులైన రై తులకు 100 శాతం వ్యవసాయ రుణాలు అందించాలని ఆదేశించారు.

ప్రధానమంత్రి స్వనిధి, పీఎంఎఫ్‌ఎంఈ, ప్రధానమంత్రి ము ద్ర ప థకాల ద్వారా అర్హులకు రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఇప్పటికే 341 మంది ల బ్ధిదారులకు రుణాలు అందించామని, పెం డింగ్లో ఉన్న 143 దరఖాస్తులను పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని సూచించా రు.

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతీ యువకులకు నిబంధనల మేరకు రుణాలు అందిం చాలని అన్నారు.వ్యవసాయ, గృహ నిర్మా ణ, విద్యా రుణాల మంజూరులో నిర్లక్ష్యం వ హించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలోజిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ద త్తారావు, ఎల్డీఎం జనార్ధన్, నాబార్డ్ జీఎం వీ రభద్రుడు,బ్యాంకుఅధికారులు పాల్గొన్నారు.

వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి

- పర్యావరణ పరిరక్షణతో పాటు భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందిం చేందుకు వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో వన మహోత్సవం-2026 కార్యక్రమంలో భాగం గా ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, జిల్లా అటవీ అధికారి బాలమణితో కలిసి కలెక్టర్ మొక్కలునాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీ సుకోవాలని సూచించారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడ టంతో పాటు భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, సహజమైన వాతావరణాన్ని అందించ వచ్చన్నారు.

జిల్లాలో వన మహోత్సవం కిం ద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రా మీణ అభివృద్ధి అధికారి దత్తారావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, అటవీ శా ఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.