ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిసిన గురుకుల్ పరిరక్షణ సమితి
ఘట్ కేసర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు మంగళవారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
రెండు రోజుల క్రితం గురుకుల్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పిన ప్రకారం కళాశాల ప్రిన్సిపాల్, గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులతో గురుకుల్ కళాశాలలో నెలకొన్న అధ్యాపకుల కొరత, గురుకుల్ ను ఎండోమెంట్ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే విధంగా ఎటువంటి చర్యలు తీసుకో వాలి అనే అంశం పై ఎమ్మెల్యే మల్లారెడ్డి చర్చించారు.
అనంతరం వెనువెంటనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్, డిఈ లతో తో మాట్లాడి అధ్యాపకుల కొరత గురుకుల కళాశాలలో లేకుండా చూడాలని వారితో మాట్లాడడం జరిగింది. వారు ఎమ్మెల్యే మ ల్లారెడ్డి వినతిని వెంటనే స్పందించి త్వరలో గురుకుల కళాశాలకు అధ్యాపకులను పం పించడం జరుగుతుందని మల్లారెడ్డి కి హామీ ఇవ్వడం జరిగిందని గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో గురుకుల్ పరిస్థితిని వివరించడానికి సెప్టెంబర్ నెల 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలలో కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందని, గురుకుల్ కళాశాలకు సంబంధించిన కొన్ని పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల పరిరక్షణ సమితి సభ్యులు ఎమ్మెల్యే మల్లారెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా, బిజిలి సదానందం, ఎండి సిరాజ్, గురుకుల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






