26 August, 2026 | 3:25 AM

విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన

26-08-2026 02:21 AM

మొయినాబాద్ ఆగస్టు 25 (విజయక్రాంతి): బాలల హక్కులు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ కోసం ఉన్న చట్టపరమైన నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

న్యాయ సహాయ సంఘం, ICFAI లా స్కూ ల్, IFHE హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోక్సో చట్టం-2012, బాలల హక్కులు, వేధింపులు ఎదురైనప్పు డు తీసుకోవాల్సిన చర్యలు, ఫిర్యాదు చేసే వి ధానాలపై విద్యార్థులకు వివరించారు. పెద్దమంగళారం కౌన్సిలర్ పద్మటి మమతారెడ్డి మాట్లాడుతూ.. పిల్లల రక్షణలో సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో విద్యార్థులు పోస్టర్ ప్రదర్శన, మూకాభినయం, బౌండరీ సార్టింగ్ గేమ్ ద్వారా బాలల భద్రత, సురక్షితఅసురక్షిత ప్రవర్తనలపై అవగాహన పొందారు. 1098 చైల్ హెల్ప్లైన్, POCSO ఈ-బాక్స్ వంటి సహాయ వనరులపై కూడా వివరించారు. బాలలపై వివక్ష, దుర్వినియోగం, బెదిరింపులకు వ్యతిరేకంగా సున్నా సహన విధానాన్ని పాటించాలని కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా న్యాయ అవగాహన కార్యక్రమాల నిర్వహణకు IFHE యాజమాన్యం సహకారం అందిస్తోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని డాక్టర్ ఎస్. కన్నన్, లీగల్ ఎయిడ్ సొసైటీ సభ్యులు నిర్వహించారు.