24 March, 2026 | 6:37 PM

గజ్వేల్‌లో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం అవగాహన కార్యక్రమం

24-03-2026 04:54 PM

గజ్వేల్: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విభాగాధిపతి డా. విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కాలేజ్ ప్రిన్సిపల్ డా.నిఖత్ అంజుమ్ ముఖ్య అతిథిగా హాజరై, క్షయవ్యాధి నివారణ, ముందస్తు పరీక్షలు, సరైన చికిత్సపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపల్ గణపతి రావు  విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మైక్రోబయాలజీ లెక్చరర్ లావణ్య విద్యార్థులకు క్షయవ్యాధి వ్యాప్తి విధానం, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో జ్యోతి, ఇతర విద్యార్థులు సక్రియంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.