13 July, 2026 | 3:09 PM

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పరిశీలించిన కౌన్సిలర్

13-07-2026 02:11 PM

 ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలించి సిబ్బంది ఓటర్లకు తగు సూచనలు ఇవ్వాలని, 11వ వార్డు కౌన్సిలర్, డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం అన్నారు. సోమవారం ఆయన 11వ వార్డులోని అంగన్వాడి ఎస్ఐఆర్ కేంద్రంలో దరఖాస్తు ప్రక్రియ కొనసాగింపు  పరిశీలించారు. సమాచారం అందని ఓటర్లకు సమాచారం ఇచ్చి ఓట్లు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ రామలక్ష్మి, వార్డ్ ఆఫీసర్ రామకృష్ణ ,ఆర్ పి సునీత, తదితరులు ఉన్నారు.