13 July, 2026 | 3:07 PM

జిల్లెల్లలో మంత్రి వివేక్‌కు కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ స్వాగతం

13-07-2026 02:16 PM

తంగళ్ళపల్లి,జూలై 13 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉపాధి, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ఎక్స్‌రోడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు, తాజా మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ ఆధ్వర్యంలో మంత్రికి పూల బొకే అందజేశారు. అనంతరం మంత్రి వివేక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.