కాంగ్రెస్ పాలనలో అతిపెద్ద భొగ్గు కుంభకోణం
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర(BJP Singareni Bharosa Yatra) జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), బీజేపీ చీఫ్ రామచందర్ రావు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో అతిపెద్ద బొగ్గు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు బొగ్గు కుంభకోణం(Coal scam) జరినట్లు కిషన్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన బొగ్గు కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని వివరించారు. బొగ్గు గనుల కేటాయింపు పారదర్శకంగా చేపట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వేలం లేకుండా ఇచ్చిన ఏకైక బ్లాక్.. తాడిచర్ల 2. తాడిచర్ల 2 బ్లాక్ లో గ్రేడ్-8 బొగ్గు అందుబాటులో ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మరో 40,50 ఏళ్ల పాటు తాడిచర్ల 2 బ్లాక్ లో నాణ్యమైన బొగ్గు దొరుకుతోందని వెల్లడించారు. బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురుచూస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి ప్రస్తుత పరిస్థితికి బీఆర్ఎస్ పాలనే కారణమని ఆరోపించారు. కేసీఆర్ అహంకారపూరిత పనులే దీనికి కారణమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.సింగరేణిని అడ్డుం పెట్టుకుని రాజకీయాలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్.. పదేళ్ల పాటు సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారని విమర్శించారు. సింగరేణికి చేసిన మేలు ఏమిటో కేసీఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి అవసరాల కోసం ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ పై మాత్రం కేసీఆర్ మాట్లాడలేదన్నారు. సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ ను మోదీ ప్రభుత్వం ఇప్పించిందని వెల్లడించారు. సింగరేణి సమస్యలపై అనేక సార్లు ప్రధాని మోదీకి(Prime Minister Narendra Modi) చెప్పినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.






