13 July, 2026 | 1:47 PM

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి

13-07-2026 12:46 PM

ఎమ్మెల్యే ను కలిసిన కరత్వాడ గ్రామస్తులు.. 

బోథ్, జూలై 13 (విజయక్రాంతి): మండలంలోని కరత్వాడ గ్రామానికి చెందిన మహిళలు సోమవారం స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్(MLA Jadav Anil) ను కలిసి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. తాము గుడిసెలలో జీవిస్తున్నామని వివరించారు స్పందించిన ఎమ్మెల్యే గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడి గ్రామంలో సర్వే నిర్వహించి గుడిసె వాసుల జాబితాను అందించాలని ఆదేశించారు అంతేగాక ఇండ్లు మంజూరి అయ్యే విధంగా చూస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు