13 July, 2026 | 3:10 PM

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్

13-07-2026 02:08 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సోమవారం ఇల్లందు క్రాస్ రోడ్‌లోని సింగరేణి గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ అంకిత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డికి మొక్కను అందజేసి జిల్లా యంత్రాంగం తరఫున ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలపై స్వల్పంగా చర్చించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.