13 July, 2026 | 3:07 PM

సభ స్థలాన్ని పరిశీలించిన సర్పంచ్ గ్రామస్తులు

13-07-2026 02:18 PM

మల్దకల్ జూలై 13: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని కుర్తి రావుల చెరువు గ్రామంలో రేపు (మంగళవారం) మధ్యాహ్నం 1 గంటలకు  నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు వస్తున్నట్లు సర్పంచ్ కే.భగవంతు తెలిపారు. డిప్యూటీ సీఎం పర్యటన నిమిత్తం ఏర్పాటు    మాజీ డిసిసి చైర్మన్ పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని క్రికెట్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ స్థలాన్ని ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, గ్రామస్తులతో కలిసి స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామంలో చాలాకాలంగా వేధిస్తున్న లో- వోల్టేజి సమస్య ఈ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభంతో  పూర్తిగా తొలగిపోనుంది. ముఖ్యంగా రైతాంగానికి వ్యవసాయ మోటార్ల కొరకు ,గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన, నిరంతరం విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవన్న, భాస్కర్ గౌడ్, మాజీ కో ఆప్షన్ నెంబర్ మహబూబ్ అలీ,సీసీ మల్దకల్,బుడ్డన్న, కర్ణాకర్, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.