ఎస్ఆర్ఆర్ లో డిజిటల్ టీచింగ్ టూల్స్ పై కార్యశాల
ముకరంపుర,(విజయక్రాంతి): స్థానిక SRR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో IQAC ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిజిటల్ టీచింగ్ టూల్స్ పై కార్యశాల జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ నితిన్ పాటక్ మాట్లాడుతూ... ప్రస్తుత కాలంలో ప్రతి అధ్యాపకుడు డిజిటల్ టీచింగ్ టూల్స్ పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.
IQAC కోఆర్డినేటర్ శ్రీమతి హరిజ్యోతి కౌర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్య వక్త శ్రీ బి నరేష్ అందుబాటులో ఉన్న వివిధ రకాల టీచింగ్ టూల్స్ గురించి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ టీ కరుణాకర్ అధ్యాపకులు, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, రాజేశం, సోమనర్సయ్య, స్వరూప రాణి, పాల్గొన్నారు.






