14 March, 2026 | 2:00 AM

మార్పు ఇంటి నుంచి మొదలవ్వాలి

13-03-2026 12:45 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

పటాన్చెరులో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు 

పటాన్ చెరు, మార్చి 12: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ ఆధ్వర్యంలో గురువారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రజా ప్రతినిధులు, వేలాదిమంది మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ అంశాలపై ప్రముఖులచే ఉపన్యాసాలు, బహుమతుల పంపిణీ కార్యక్రమాలు అందరిని ఉత్సాహపరిచాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో మహిళా విద్యావంతురాలు అయితే ఒక తరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరారు. సర్వైకల్ క్యాన్సర్ విముక్తి కోసం ప్రభుత్వం అందిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ను బాలికలతో మొదలు మహిళలందరూ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన పక్షంలో పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, ప్రముఖ వైద్యులు, ఎమ్మెల్యే జిఎంఆర్ కోడలు గూడెం కిరణ్మయి విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ కవితా రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ఆర్తి, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.