పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం.చిన్న వెంకట్ రెడ్డి
నేరేడుచర్ల, జూన్ 28 : ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమం పి.హెచ్.సి డా. పున్న నాగిని అధ్యక్షతన నేరేడుచర్లలో ప్రారంభించిన సందర్బంగా మున్సిపల్ చైర్మన్ కొణతం. చిన్న వెంకట్ రెడ్డి అన్నారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి,కమిషనర్ నాగరాజు,డా.పున్న నాగిని లు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని, ఏ చిన్నారి కూడా పోలియో చుక్కలు తీసుకోకుండా మిగిలిపోకూడదని కోరారు.
ప్రజలు తమ పరిసరాల్లోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సల్వాది శ్రీనివాస్ సి హెచ్ వో,, ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు స్థానిక , ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు.






