14 March, 2026 | 2:47 AM

గ్రామాలను, పట్టణాలను స్వయం సమృద్ధి సాధించే విధంగా కృషి చేయాలి

13-03-2026 12:45 AM

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి

వనపర్తి, మార్చి 12 ( విజయక్రాంతి ) :గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు అన్నీ తానై గ్రామాలను, పట్టణాలలో అభివృద్ధి పనులు చేపట్టి  స్వయం సమృద్ధి సాధించే విధంగా కృషి చేయాలనీ   రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి లు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు , స ర్పంచులకు  సూచించారు. 

ప్రజాపాలన ప్ర గతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగ గురువారం వనపర్తి పట్టణంలోని కల్యాణ సాయి గార్డెన్ లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు సర్పంచులకు ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ, అ వగాహన కార్యక్రమంలో వనపర్తి శాసన స భ్యులు తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర స్పోరట్స్ అ థారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ లోక ల్ బాడీస్, మున్సిపల్ చైర్ పర్సన్ లతో కలి సి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామాలలో ప్రజ లు 90% పట్టణాల్లో కేవలం 10 శాతం నివసించేవారని కానీ మారిన పరిస్థితుల్లో పట్ట ణాల్లో 70 శాతం గ్రామాల్లో 30% ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి సర్పంచ్ ప్రతి వార్డు కౌన్సిలర్లకు ప్రజల కనీస అవసరాలు తీర్చి తమ ప్రాం తాన్ని అభివృద్ధి పరచే బాధ్యత ఉందని, అభివృద్ధి చేసిన ప్రజా ప్రతినిధికి వారు దిగిపోయే రోజున నెత్తిన కిరీటం పెట్టి గౌరవిస్తా రని లేదా తిరిగి ఎన్నుకుంటారని తెలియజే శారు.

వార్డు మెంబర్లను సైతం ప్రజలు ఓటు వేసి తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారని అం దువల్ల అన్ని సర్పంచేకే సంబంధం అని నిర్లక్ష్యంగా ఉండటాని వీలు లేదని వార్డు మెం బరు  తన వార్డులో ప్రజలకు అవసరమైన తాగు నీరు, పారిశుధ్యం, ఇతర అభివృద్ధి ప నులను సర్పంచుతో సమన్వయం చేసుకొని చేపట్టాలని వారు ఉద్బోధించారు. చేతి వృత్తులను ప్రోత్సహించి గ్రామాలు, పట్టణాలు స్వయం సమృద్ధి సాధించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధుల పై ఉందని బాధ్యతలను వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతా రెడ్డీ, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్. ఖీమ్య నాయక్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు చైర్ పర్సన్ శ్రీనివాస్ గౌడ్, కొత్తకోట చైర్ పర్సన్ పి. అరుణ,   ఆత్మకూరు చైర్ పర్సన్ నాగమ ణి,  అమరచింత చైర్ పర్సన్ జింక సువర్ణ , వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.