హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం
28-06-2026 06:15 PM
నల్లగొండ(విజయక్రాంతి): హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) మొదటి దశలో భాగంగా రూ. 13,006.27 కోట్లతో 6,092.37 కిలోమీటర్ ల మేర రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ లో ఏర్పాటు చేసిన హ్యామ్ రోడ్ల పైలాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తదుపరి నల్లగొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ఎన్జీ కళాశాలలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. ఈయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






