అసోం, అరుణాచల్‌లో భారీ వర్షాలు
అరుణాచల్‌లో కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి
కేమీ నదిపై కూలిన వంతెన
డీస్ఫూర్/ఇటానగర్, జూన్ 28 (విజయక్రాంతి): తూర్పు రాష్ట్రాలైన అసోం, అరుణా చల్ ప్రదేశ్, సిక్కింలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు నీటితో నిండిపోయి వరదలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
ధేమాజీ జిల్లాలో ఉన్న కేమీ నదిలో వరదల కారణంగా 300 మీటర్ల పొడవైన వంతెన కొట్టుకుపోయింది. సిక్కింలోని జోంగు ప్రాంతంలో ఫై ఖోలా నదిపై ఉన్న బెయిలీ వంతెన కొట్టుకుపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాలలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం.






