కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలి
సూర్యాపేట జిల్లా సీపీఐ కార్యదర్శి బెజవాడ. వెంకటేశ్వర్లు
నేరేడుచర్ల, జూన్ 28 : ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలై 1న సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
ఆదివారం నేరేడుచర్లలో సిపిఐ ముఖ్యల సమావేశంలో అయన మాట్లాడుతూ,రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పడి సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రజలు ఆశించిన స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగడం లేదని,జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో ప్రభుత్వ భూములలో నిరుపేదల గుడిసెలు వేసుకున్నప్పటికీ వారికి పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, అర్హులైన అందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని, వితంతు, దివ్యాంగుల పెన్షన్ లు ఎన్నికల హామీల ప్రకారం పెంచి, ఇవ్వాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.లక్ష్మి, ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికె భరత్ పాల్గొన్నారు.






