4 August, 2026 | 4:40 AM

సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం

04-08-2026 12:10 AM
  1. టీజేఎస్ మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ పుష్పనీలా గౌడ్
  2. నూతన మహిళా సభ్యులకు సభ్యత్వాల అందజేత 

నాగోల్, ఆగస్టు 3 (విజయ క్రాంతి): నాగోల్లోని తెలంగాణ మహిళా జన సమితి కార్యాలయంలో మహిళలు ఆత్మీయంగా స మావేశమై స్నేహబంధాన్ని మరింత బలోపే తం చేసుకున్నారు. టీజేఎస్ మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ పుష్పనీలా గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కట్ చేసి ఫ్రెండ్షిప్ డేను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పుష్పనీలా గౌడ్ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, పరస్పర స్నేహం, నమ్మకం, సహకారంతో మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగాలని అన్నారు.

స్నేహితుల దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాకుండా మహిళల మధ్య ఐక్యతను, పరస్పర మద్దతును పెంపొందించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీలో చేరిన సి. సుధారాణి, అరుణ, శ్వేత, రుక్మిణి, డి. లక్ష్మి, ఉషారాణి, ఉదయ శ్రీ గౌడ్లకు పార్టీ సభ్యత్వాలను అందజేసి స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి మహిళలు చురుకుగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్నేహం, సేవాభావం, ఐక్యతను ప్రతిబింబించేలా వేడుకలను విజయవంతం చేశారు.