4 August, 2026 | 2:32 AM

ముత్తంగికి చెందిన మహిళ అదృశ్యం

04-08-2026 12:01 AM

పటాన్‌చెరు, ఆగస్టు 3 : సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి గ్రామానికి చెందిన తలారి మాధవి 20 సంవత్సరాలు అనే మహిళ సోమవారం ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి, అనంతరం తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త చెన్నయ్య పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులో నర్సింలు అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉన్నట్లు భర్త పేర్కొన్నారు.

ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మహిళ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడం, బంధువులు, స్నేహితులు, సంబంధిత వ్యక్తులను విచారించడం జరుగుతోంది. మహిళ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా పటాన్ చెరు పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.