11 May, 2026 | 1:38 AM

భూసమస్యపై దళిత కుటుంబం దీక్ష..

11-05-2026 12:37 AM

అధికారులు స్పందించే వరకు టెంట్ లోనే..

తూప్రాన్, మే 10: పూర్వీకుల స్థిరాస్తి అనువంశకం ద్వారా సంక్రమించి పెద్దయ్య వద్ద గత 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి కబ్జాలో ఉండి ఆ భూమిలో వరి, ఆవాలు, పత్తి, మొక్కజొన్న పంటలు పండిస్తూ సాగులో ఉన్న తమ భూమిని ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపిస్తూ ఘనపూర్ లో ఓ దళిత కుటుంబం నిరాహార దీక్షకు దిగింది. ఘనపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని ఆ కుటుంబం మొత్తం గ్రామపంచాయతీ వద్ద టెంట్ క్రింద న్యాయం జరిగే వరకు నిరసనకు దిగారు.

బాధితుడు ఏడేల్లి నర్సింలుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఏడేల్లి లక్ష్మీ, సుశీల, లలిత, భాగ్య, సుధాకర్, వినయ్, ఎల్లం, భాస్కర్, విజయ్ లు కలిసి దీక్షలు కూర్చున్నారు. వారి తాత ఏడేల్లి హరిజన చిన్న బాలయ్య పేర సర్వే నెంబర్ 157 లో 2 ఎకరాల 13 గుంటల వ్యవసాయ సాగు భూమి 1954-55 నుంచి అనువంశికంగా స్థిరాస్తిగా పట్టాభూమిని తదనంతరం అతని పెద్ద కుమారుడు ఏడేల్లి హరిజన మైసయ్య కు 1 ఎకరా 07 గుంటలు, చిన్న కుమారుడు ఏడేల్లి హరిజన దుర్గయ్య కు 1 ఎకరా 06 గుంటల భూమి నీ పంచోటి చేసుకొని అనుభవిస్తున్నారు.

కాగా 1995 లో ఏడేలీ హరిజన మైసయ్య వద్ద సర్వే నెంబర్ 157/ఆ లోని ఏడేల్లి హరిజన నర్సయ్య 1 ఎకరా 07 గుంటలు పది రూపాయల స్టాంప్ సాదా భైనామా ద్వారా కొనుగోలు ద్వార సంక్రమించిన భూమిలో గత 30 ఏళ్ల నుంచి సాగు చేస్తూ కబ్జాలో కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉండగా గ్రామానికి చెందిన కొందరు కన్నేసి కాలక్రమేనా మైసయ్య మరణించగా మైసయ్య పేర ఉన్న విషయం తెలుసుకొని అతని భార్య సువర్ణ పేర పౌతీ చేయించి తద్వారా అదే గ్రామానికి చెందిన ఆకుల మహేష్  అట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

కాగా  ఈ నెల 3వ తేదీన సర్వే చేయడానికి ఏడేల్లి నర్సింలుకు నోటీస్ ఇచ్చి మీ పక్క భూమిలో సర్వే చేస్తున్నాము అని తెలిపి తీర తన భూమి వద్దకు రాగా సర్వే నిలువరించి అక్కడి నుండి సర్వే అధికారులను తిప్పి పంపించి అసలు విషయం బయటకు రావడంతో రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశారు. వారి నుంచి సానుకూలంగా స్పందన రాకపోవడంతో ఏకంగా ఘనపూర్ గ్రామపంచాయితీ కార్యాలయం ముందు టెంట్  వేసుకొని మాకు న్యాయం చేయాలంటూ.. ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేసి టెంట్ కింద దీక్షకు దిగారు.

ఏడేల్లి నర్సింలు అతని భార్య కథనం ప్రకారం.. తన సోదరుడు మైసయ్య వద్ద 157/ఆ సర్వే నెంబర్ లో 1.07 ఎకరాల భూమిని 30 ఏళ్ల క్రితం సాదాబైనామాతో కొనుగోలు చేసిసాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ఆ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నర్సింలు కుటుంబీకులు గ్రామ పంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు. వీరికి గ్రామ ప్రజల మద్దతు లభిస్తున్నప్పటికీ రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.