4 April, 2026 | 4:18 AM

పల్లెదారుల మరమ్మతులకు మోక్షమెప్పుడో?

14-10-2025 12:00 AM

బీటీదారులు నిర్మించక ఇబ్బందులు పడుతున్న  ప్రజలు 

కల్వకుర్తి అక్టోబర్ 12 : గత కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు బిటిగా మార్చకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా మట్టి రోడ్లు కావడం అధిక వర్షాలు కురుస్తుండడంతో దారులన్నీ దెబ్బతిని రాకపోకలకు వీల్లేని విధంగా మారాయి. అదే మార్గాల్లో భారీ వాహనాలు సైతం వెళ్తుండడంతో నిత్యం వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

అధిక మంది పాడి రైతులు  ఉదయం సాయంత్రం రాకపోకలు చేస్తుండడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు నియోజకవర్గ సరిహద్దు గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మట్టి దారిలో దర్శనమిస్తున్నాయి. నిత్యం గతుకుల రోడ్డులోని వాహనదారులు రాకపోకలు చేస్తున్నారు. అధికారులు ప్రజా ప్రతి నిధులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లోని మట్టి దారులను బీటీ దారుల మార్చాలని ప్రజలు కోరుతున్నారు.