పాములపై అపోహలకు చెక్..
ఎఫ్సీఆర్‌ఐలో సరీసృపాలపై అవగాహన
గజ్వేల్, జూన్ 11: ప్రపంచ పర్యావరణ దినోత్సవం2026 సందర్భంగా తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భా గంగా ములుగు జిల్లా సిద్ధిపేటలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్‌ఐ)లో సరీసృపాల అవగాహన ప్రదర్శన, పాముకాటు నివారణ అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొ సైటీ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం లో బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, హౌస్కీపింగ్, గార్డెనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
నిపుణులు సరీసృపాల పర్యావరణ ప్రాధా న్యం, విషపూరితవిషరహిత పాముల గుర్తిం పు, పాముకాట్ల నివారణ చర్యలు, సరైన ప్ర థమ చికిత్స విధానాలపై అవగాహన కల్పించారు. అలాగే పాములపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ, వాటి సంరక్షణ అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎఫ్సీఆర్‌ఐ తుది సంవత్సరం విద్యార్థి శ్రీ కార్తీక్ కళాశాల ఆవరణలో కనిపించే వివిధ పాముల జాతులు, వాటి నివాసాలు, పర్యావరణంలో వాటి పాత్ర, క్షేత్రస్థాయి కార్యక లాపాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రజెంటేషన్ అందించారు.
పాముకాటు సంభవించినప్పుడు భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉం డటం, ప్రభావిత అవయవాన్ని కదలకుండా ఉంచడం, వెంటనే వైద్య కేంద్రంలో చికిత్స పొందడం ఎంత ముఖ్యమో నిపుణులు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్సీఆర్‌ఐ డిప్యూ టీ డైరెక్టర్ శ్రీమతి ఎన్. కవిత (ఏసీఎఫ్), అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






