22 August, 2026 | 7:05 PM

పాలెం వెంకన్న ఆలయంలో కళ్యాణ వైభోగం

22-08-2026 05:47 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రావణ మాసం రెండో శనివారం సందర్భంగా పాలెం వెంకన్న ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం 36 మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామానుజాచార్యులు, సహాయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.