22 August, 2026 | 8:58 PM

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక శిశు మందిరాలు

22-08-2026 06:43 PM

- మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ

- గణిత విజ్ఞానమేళకు విశేష స్పందన

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక శిశు మందిరాలు అని మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శనివారం మంచిర్యాల సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విభాగ స్థాయిలో నిర్వహించిన గణిత విజ్ఞానమేలకు ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ తో కలిసి మాట్లాడారు. గణితం కేవలం పాఠ్యాంశం మాత్రమే కాకుండా, నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ముఖ్యమైన శాస్త్రమని తెలిపారు.

విద్యార్థులు గణితంపై భయాన్ని వీడి, ఆసక్తితో సాధన చేయడం ద్వారా ఉన్నత ఫలితాలను సాధించవచ్చన్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ విభాగ్ స్థాయి గణిత విజ్ఞాన సంస్కృతి మహోత్సవం కార్యక్రమంలో విభాగ స్థాయిలో 9 పాఠశాలలకు చెందిన సరస్వతి శిశు మందిరాల నుంచి 2008 మంది విద్యార్థులు, ప్రబంధ కారిణిలు పాల్గొని తమ గణిత విజ్ఞాన ప్రదర్శనను ప్రదర్శించి అందరీని ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ సత్తయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ రావు,  ఎంఈఓ మాళవిక దేవి,  కార్పొరేటర్లు షేర్ లక్ష్మీ పవన్,  చిలువేరు జ్యోతి, సుధమల్ల హరికృష్ణ, విభాగ్ అధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ రావు, కార్యదర్శి దహగాం గోవిందరావు,  ఉపాధ్యక్షులు సదాశివ్, సహకార్యదర్శి గుండం అశోక్,  కార్యక్రమ నిర్వాహకులు పాఠశాల అధ్యక్షులు చందూరి మహేందర్, కార్యదర్శి గుండా సుధాకర్,  కోశాధికారి కొమ్మెర విశ్వేశ్వర శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిని తదితరులు పాల్గొన్నారు.