పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం
హన్వాడ మండలంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల నియామక పత్రాల పంపిణీ
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీఓ యశోద, మైత్రి యాదయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, డీసీసీ జనరల్ కార్యదర్శి జె. వెంకటయ్య, మహిళా అధ్యక్షురాలు నవనీతతో పాటు ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామీణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






